చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్కు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. వాటిని శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు. అధికారికంగా తాము ప్రకటించే వరకూ వందతులను నమ్మవద్దని ఆయన కోరారు.
