మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో భోయ సంగం వారు కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఐన ఈ విషయం పై కోర్ట్ వారికి వ్యతిరేఖంగా తీర్పు ఇవ్వక తప్పలేదు. దాంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు వాల్మీకికి బదులుగా “గడ్డలకొండ గణేష్” అనే టైటిల్ పెట్టారు. దీంతో వెంటనే డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ ఈ చిత్ర భోయ సంఘాన్ని కించపరిచేలా ఉండదని, అందులే టైటిల్ ఇలా పెట్టమని అందులో ఎంత నిజం ఉందో సినిమా చూస్తే మీకే అర్ధమవుతుందని అన్నారు.