ఏపీలో సీఎం జగన్‌పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే..రాజధాని విషయంలోకాని, సన్నబియ్యం విషయంలోకాని, పల్నాడు విషయంలో కాని, కోడెల ఆత్మహత్య విషయంలో కాని చంద్రబాబు జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. అయినా సీఎం జగన్ అవన్నీ మనసులో పెట్టుకోకుండా పాలనలో నిమగ్నమయ్యాడు. ఇదిలా ఉంటే సీఎం జగన్ చంద్రబాబుకు చెప్పినట్లే ఓ పని చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. . తాజాగా అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ఈ పోస్టును ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పీఏసీ ఛైర్మన్ పదవి కోసం పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీకి చెందిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ్యవహరించారు. అయితే చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపి ఆయన్ని తన పార్టీలోకి లాక్కున్న తర్వాత…ఆనవాయితీ ప్రకారం డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. భూమా నాగిరెడ్డి టీడీపీలో పార్టీ ఫిరాయించిన అనంతరం ఈ పదవి బుగ్గనను వరించింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన పయ్యావులకు పీఏసీ ఛైర్మన్ పదవి దక్కింది. అదీ చంద్రబాబు సూచనల మేరకు సీఎం జగన్ పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేయడం గమనార్హం. మొత్తంగా చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా..పట్టించుకోకుండా..ఆయన సూచనల మేరకు పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావు కేశవ్‌ను ఎంపిక చేసి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.. అదే జగన్ ప్లేస్‌లో చంద్రబాబు ఉంటే..తనకు ఇష్టం లేని వ్యక్తిని పీఏసీ ఛైర్మన్‌గా ప్రతిపాదిస్తే..ఎన్ని డ్రామాలు ఆడేవాడో..అందుకే ప్రతి విషయంలో చంద్రబాబులా రాజకీయాలు చేయడం జగన్‌కు నచ్చదు…దటీజ్ జగన్ అంటున్నారు వైసీపీ అభిమానులు.