మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడే సినిమాకు అసలు టెన్షన్ మొదలైంది.విషయానికి వస్తే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో భోయ సంఘం వారు కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఐన ఈ విషయం పై కోర్ట్ వారికి వ్యతిరేఖంగా తీర్పు ఇవ్వక తప్పలేదు. దాంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు వాల్మీకికి బదులుగా “గడ్డలకొండ గణేష్” అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ మార్పిడి వల్ల చిత్రానికి మేలు జరుగుతుందా లేదా అనే విషయానికి వస్తే ఇది చిత్రానికి మైనస్ అనే చెప్పాలి ఎందుకంటే వాల్మీకి టైటిల్ ఇప్పటికే అందరి మైండ్ లో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఏ టైటిల్ వచ్చినా వారి బుర్రలోకి ఎక్కదు. ఈ విషయం పై చిత్ర యూనిట్ కొంచెం ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి మీ ఒపీనియన్ కూడా చెప్పండి.