తెలంగాణలో వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రేమ్ కుమార్ చెప్పారు.
