టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను తీసే ప్రతీ చిత్రం ఒక ఇన్స్పిరేషనల్ మోటివ్ తో ఉంటుంది. మొన్నటికి మొన్న చంద్రబాబు కు చుక్కలు చూపించే విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి అందరికి షాక్ ఇచ్చాడు. అనంతరం ఇప్పుడు మరో సినిమాతో వివాదానికి తెరలేపుతున్నాడు. అది ఏ సినిమా అనేది అందరికి తెలిసిందే. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”..ఈ చిత్రానికి సంభందించి ఒక్కొకటిగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటని అడిగితే, అతడి సమాధానం ఎలా ఉందో చూడండి. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం, కమ్మవాళ్ళు ఓడిపోవడమే ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణమని చెప్పాడు. ప్రస్తుతం వర్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరికి ఏం అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.