మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల నొప్పి, ఆర్థరైటిస్ సమస్య తగ్గదు. మందులతో తాత్కాలికంగా ఉపశమనం కలిగినా..ఆర్థరైటిస్ ఏళ్ల తరబడి పట్టిపీడిస్తూనే ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మందుల కంటే..ఇంట్లో తయారు చేసే ఒక ప్రత్యేక పానీయం..మోకాళ్ల నొప్పిని, ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. ఇంతకీ ఆ పానీయం ఏంటి అనుకుంటున్నారా. .అక్కడికే వస్తున్నాను. ఇంట్లో వంటలో మిరియాలు, అల్లం, జీలకర్ర ఎక్కువగా వాడుతుంటాం కదా..వీటిలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా రోగాలకు రెమెడీస్‌గా వీటిని వాడుతారు. ముఖ్యంగా వీటిని ఔషధ గుణాలు, మోకాళ్లు, ఆర్థరైటిస్ సమస్యను నివారిస్తాయి ఈ అల్లం, మిరియాలు, బార్లీ గింజలు, జీలకర్రతో తయారు చేసిన ప్రత్యేక పానీయం తాగితే క్రమంగా మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. ముందుగా పానీయం తయారు చేయడానికి నాలుగు టేబుల్ స్పూన్లుమిరియాలు, మూడు టీస్పూన్ల జీలకర్ర, మూడు టీస్పూన్ల బార్లీ, కొద్దిగా అల్లం తీసుకుని, వాటిని కాసేపు పొయ్యిమీద వేసి, చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్‌లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లను వేడి చేయాలి. నీళ్లు మరుగుతుండగా…ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసి, బాగా కలియతిప్పి మరిగించాలి. తర్వాత వడబోసి గోరువెచ్చగా తాగితే..మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పానీయం ఉదయం భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. డైలీ మిరియాలు, అల్లం, జీలకర్ర, బార్లీ గింజలతో తయారు చేసిన ఈ డ్రింక్ తాగితే మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. వేలవేలకు వేలు ఆసుపత్రులకు తగలేసే బదులు ఇంట్లోనే చౌకగా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే బెటర్ కదా..మీకే కాదు..మీ బంధువులు, మిత్రులలో ఎవరికైనా మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉంటే ఈ డ్రింక్ గురించి చెప్పండి..ఓకేనా..
