ఆంధ్రప్రదేశ్ లోని యువత ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
