బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. ఇంటిసభ్యులకు ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో భాగంగా పాఠాలు చెప్పిన టీచర్లు వరుణ్, వితిక, బాబా భాస్కర్‌లు విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. చిల్లాలజీ లెక్చరర్ వరుణ్ పెట్టిన పరీక్షలో స్టూడెంట్స్ మహేశ్, శివజ్యోతి, హిమజలు 5 స్టార్స్ తెచ్చుకోగా శ్రీముఖి, రాహుల్‌లు మాత్రం 4 స్టార్లతో వెనకబడిపోయారు. ఇక గాసిపాలజీ టీచర్ వితిక నిర్వహించిన పరీక్షలో శివజ్యోతి టీచర్‌పైనే గాసిప్ సృష్టించగా, ఇద్దరి మధ్య ఎలా గొడవ పెట్టవచ్చు అనే ప్రశ్నకు శ్రీముఖి చెప్పిన సమాధానంతో టీచర్‌ను నోరెళ్లబెట్టేలా చేసింది. నువ్వు విన్న బిగ్గెస్ట్ గాసిప్ చెప్పమని పునర్నవిని అడగ్గా అది బయటపెడితే జనాలు తనను చితకబాదుతారని పేర్కొన్నప్పటికీ మహేశ్-బాబా భాస్కర్‌ల మధ్య పెరుగుతున్న దూరాన్ని సమాధానంగా చెప్పింది. అనంతరం టీచర్ వితిక తాను విన్న గాసిప్‌లపై విద్యార్థులను ప్రశ్నించింది. మన గురించి గాసిప్ వస్తే అది గొప్ప విషయమని పునర్నవి పేర్కొంది. మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్-పునర్నవిలను నిలదీయగా అటు ఫ్రెండ్స్ కాదు, ఇటు లవర్స్ కూడా కాదు.. కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ అని చెప్పి పునర్నవి తప్పించుకుంది.