బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. Rexona ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ ఫిదా చేశారు. ఆ రోమాంటిక్ సాంగ్ లో రాహుల్, హిమజల రోమాన్స్ చూసి అందరు నవ్వుతూంటే పునర్నవి నోరు తెరిచి షాక్ అయ్యింది. ప్రస్తుతం రాహుల్, హిమజలు రోమాన్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.