Home / ANDHRAPRADESH / తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!

తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!

భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం చూసిన చంద్రబాబు…వెంకయ్యనాయుడి సహాయంతో దేహీ అంటూ ఆయన కాళ్లమీద పడి పొత్తుపెట్టుకుని, మరొకవైపు పవన్ కల్యాణ్‌‌తో చేతులు కలిపి.. ఎలాగోలా గట్టెక్కాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంలో చేరి, నాలుగేళ్ల పాటు వంతపాడి, ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అటకెక్కించి ప్యాకేజీకి సాగిలపడ్డాడు.

అయితే ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారడం, నాలుగేళ్లలో హామీలేవి నెరవేర్చలేకపోవడం, ప్రతిపక్ష నేత జగన్‌కు ప్రజాదరణ పెరిగిపోతుండడంతో కలవరపడిన చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు  ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకుని, మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. ప్రజల్లో మోదీని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నంలో ఆయనపై నానా కూతలు కూశాడు. .ఆగర్భశత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలిపి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో రాసుకుని, పూసుకుని తిరుగుతూ…దేశమంతటా అన్ని పార్టీలను ఏకం చేసి, మోదీని దించేస్తా, లేస్తే నా అంతతోడు లేడు అన్నట్లుగా ఖబడ్దార్ అంటూ రంకెలు వేశాడు.  అంతటితో ఆగాడా.. ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష డ్రామా నడిపించి, దివ్యవాణి వంటి ఆర్టిస్టులతో బూతులు తిట్టించాడు..ఇక ఎల్లోమీడియా మా బాబు అంత వీరుడు, శూరుడు లేడు అంటూ..మోదీకి ఇక మూడుకున్నట్లే అన్నట్లు బీభత్సంగా ప్రచారం చేశాయి. ఇవన్నీ మోదీ మనసులో పెట్టుకున్నాడు. తీరా ఎన్నికలు అయ్యాక..బాబు ఘోర పరాజయం పాలయ్యాడు. సెంటర్‌లో ప్రధాని మోదీ తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చాడు.

మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వను అని రంకెలు వేసిన చంద్రబాబుకు తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంతి. . ఇక అప్పటి నుంచి రాహుల్, సోనియాలను కలిసింది లేదు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధం కావడంతో తాను, తన కొడుకు లోకేష్‌ ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అన్న భయం చంద్రబాబును పట్టి పీడిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయించాడు. అంతే కాదు తన పార్టీలో కీలక నేతలను బీజేపీలో చేరమని స్వయంగా చెబుతున్నాడు. అయితే ఏపీలో బీజేపీ బలోపేతం చేయాలని చూస్తున్న మోదీ..బాబు కుయుక్తిని గమనించి కూడా కావాలనే టీడీపీ రాజ్యసభ ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఇక వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీలో నేతలు మాట్లాడేలా చంద్రబాబు సన్నిహితులైన బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ మోదీతో సఖ్యత కోసమే చంద్రబాబు ఇలా తన పార్టీ నేతలను బీజేపీలో చేరుస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఎలాగైనా మోదీతో మళ్లీ పాత స్నేహబంధాన్ని పునరుద్ధరించుకోవాలని చంద్రబాబు, లోకేష్‌లు నానా తంటాలు పడుతున్నారు.

తాజాగా సెప్టెంబర్17 న ప్రధాని మోదీ బర్త్‌డే సందర్భంగా ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశాడు. జగన్ విషెస్‌కు స్పందించిన మోదీ ధన్యవాదాలు జగన్‌జీ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక మోదీతో మళ్లీ మాటలు కలిపేందుకు చంద్రబాబు, లోకేష్‌లు ఆయన పుట్టిన రోజును అవకాశంగా భావించారు. ఈ మేరకు భవిష్యత్తు భారత నిర్మాణంలో మీ కలలు నిజం అయ్యేలా ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు మోదీకి బర్త్‌డే విషెస్ తెలుపుతూ..ట్వీట్ చేశారు. ఇక లోకేష్‌ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. అయితే ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే మోదీ జగన్‌ ట్వీట్‌కు వెంటనే రియాక్ట్ అయి థ్యాంక్స్ చెప్పాడు. కానీ బాబు, లోకేష్‌లు బర్త్‌డే విషెస్‌ చెబుతూ చేసిన ట్వీట్లను కనీసం పట్టించుకోలేదు. దీంతో ట్విట్టర్‌ వేదికగా జగన్‌ సాక్షిగా మోదీ చేతిలో చంద్రబాబు, లోకేష్‌లకు ఘోర అవమానం ఎదురైంది. ఈ విషయంపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు వేసిన కుప్పిగంతులు, వ్యక్తిగత దూషణలు ఇంకా మోదీ మర్చిపోలేదని, అయినా బాబు పులివేషాలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని.. నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ అదే మోదీ బాబు, లోకేష్‌ల విషెస్‌కు రిప్లై ఇచ్చి ఉంటే..మూడు రోజుల నుంచి తెగహడావుడి చేసేది. అదిగో మా చంద్రబాబు అంటే ఏంటో మోదీకి అర్థమైందని, ఇక మళ్లీ మోదీ, బాబులు కలిసిపోయినట్లే అని, జగన్‌‌కు ఇక ముందుంది ముసళ్ల పండుగ అని ఎల్లోమీడియా ఛానళ్లు రెచ్చిపోయేవి. కానీ మోదీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తంగా బర్త్‌డే విషెస్‌ పేరుతో చంద్రబాబు, లోకేష్‌లు వేసిన చీప్ ట్రిక్స్‌కు ప్రధాని మోదీ సూపర్ స్ట్రోక్ ఇచ్చాడు

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat