ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్.
అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సదరు కంపెనీ పబ్ జి మొబైల్ డెవలపర్ టెన్సెంట్ గేమ్స్ తో భాగస్వామ్యమైనది. ఈ కొత్త గేమ్ కు సంబంధించిన ఫెయిడ్ వెర్షన్ ఇప్పటికే పలు ఫ్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంది. కానీ త్వరలో విడుదల చేయనున్న గేమ్ ఫ్రీ వెర్షన్ గా ఆన్ లైన్ గేమ్స్ ఆడే వాళ్లకు అందనున్నది.
అయితే దీనికి కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఈ సరికొత్త ఆట సేమ్ టు సేమ్ పబ్ జిని పోలి ఉంటుంది. దీనికి చెందిన పలు వెపన్లు,వాహానాలు అన్నిటిని సమకూర్చింది ఈ గేమ్స్ డెవలపర్.దీన్ని ఐఓఎస్,అండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంలపై ఉచితంగా లభ్యం కానుంది. .