ఏజ్ పెరుగుతున్నా ఇంకా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు నయన్. రోజు రోజుకు గ్లామర్ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఆఫర్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో కోటి పారితోషికం అడిగి రికార్డ్ సృష్టించిన నయన్ ..మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసి మిగతా హీరోయిన్లకు కుళ్లు పుట్టిస్తుంది. అయితే ఇన్ని కోట్లు తీసుకున్నా ప్రమోషన్స్, ఇంటర్వూల్లో పాల్గొనని తెగేసి చెబుతుంది. అయినా సరే నిర్మాతలు నయనే కావాలంటున్నారు. అడిగింది ఇచ్చి సినిమా చేసుకుంటున్నారు. వరుస సినిమాలు, హిట్ల మీద హిట్లతో నయన సక్సెస్ పుల్ గా ఫామ్ కొనసాగుతుంది. పర్సనల్ లైఫ్ కూడా అందంగా సాగుతుండటంతో నయన జీవితం నయనానందంగా ఉంది.