సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అందాలతార నయనతారకు ఇన్నేళ్లు వచ్చినా క్రేజ్ కొచెం కూడా తగ్గట్లేదు. నయన్ తమ సినిమాల్లో నటించేందుకు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు సరేనంటున్నారు. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా మారిందట. ఆమె కెరీర్ మెుదటిలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పయ్యా సినిమాలో నటించేందుకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం అడగడంతో ఒక్కసారిగా దక్షిణాది పరిశ్రమ నయన్ వైపు తిరిగి చూసింది. తన తొమ్మిదేళ్ల సినిమా కెరీర్లో పారితోషికం విలువ ఏకంగా రూ.6 కోట్లకు పెరిగిందని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి.
నయన తార ఎక్కువ సినిమాలు తమిళంలోనే చేసింది. చాలామంది హీరోయిన్లు కొన్నేళ్లు నిలబడి వెళ్లిపోయినా నయన్ సినీ కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. అలాగే రజనీకాంత్‌తో నటిస్తున్న సినిమాలో నయన్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకుందట. సాగుతోంది. ప్రస్తుతం నయన్ తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నెట్రిక్కన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె కంటి చూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నయనతార ఇంత వయసు వచ్చినా తన క్రేజ్ తగ్గలేదని చెప్తూనే యువ కధానాయికలకు తానేంటో నిరూపిస్తోంది.