ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది.
స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కోసం దేశ వ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి పోటీ తాకిడి ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాంఘిక సామాజిక అభివృద్ధి అంశంపై సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఇప్పటికే గ్రామంలో పలు కార్యక్రమాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంతగానో ఇతర గ్రామాలకు స్ఫూర్తినిచ్చేలా ఆకట్టుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ-ఐపీఎస్, సంజీబ్ పాత్ జోషి స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారాన్ని ఇర్కోడ్ గ్రామానికి ప్రకటించారు. కాగా స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కింద రూ.8లక్షల రూపాయల క్యాష్, ప్రశంస పత్రాన్ని దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే ఇవ్వనున్నారని సిద్ధిపేట జిల్లా పంచాయతీ అధికారిక వర్గాలు తెలిపాయి.
సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామాన్ని ఇబ్రహీంపూర్ తరహాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించి గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములుగా చేస్తూ గ్రామ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. గ్రామ స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ తదితర పలు వినూత్న కార్యక్రమాలకు ఇర్కోడ్ గ్రామాన్ని వేదికగా మార్చి అనుకున్న సత్ఫలితాలను సాధించారు.2017-18 సంవత్సరంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజంటేషన్ రూపంలో ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలో పొందే పలు అరుదైన జాతీయ పురస్కారాలు అంది పుచ్చుకునేలా గ్రామ రూపురేఖలు మారిపోయేలా గ్రామ ప్రజలంతా మనం చేయాల్సిందల్లా.. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని ఏకతాటిపైకొచ్చి మంత్రి హరీశ్ రావు విజన్ అనుగుణంగా అనుకున్న ఫలితాన్ని పొందామని గ్రామ సర్పంచ్, పాలక వర్గం, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మనం వ్యక్తిగా బాగుంటున్నాం. కానీ సంఘంగా విఫలమవుతున్నాం. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైనవి. ఆ బలంతోనే అభివృద్ది చేస్తూ పోతే గ్రామ స్వరాజ్యం వస్తుందని పలుమార్లు ఇర్కోడ్ గ్రామ సభల్లో మంత్రి హరీశ్ రావు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ సంఘటిత శక్తి విలువ తెలుసుకుని.. ఎవరి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలి! అంతే తప్ప ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని అనుకోవద్దు. గ్రామం అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమైతుందన్న మంత్రి మాటలకు ఇర్కోడ్ గ్రామ ప్రజానీకంలో ప్రేరణ కలిగి కొత్త మార్పును తీసుకొచ్చి గ్రామస్తుల తోడ్పాటు కృషితో అవార్డు వచ్చింది.అయితే తెలంగాణ రాష్ట్రంలోని 7 గ్రామ పంచాయతీలలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ మండలం మల్కాపూర్, సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామాలున్నాయి. వీటితో పాటుగా జిల్లా పంచాయతీ ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలోని వెల్గటూర్, మంథని, మల్లారం, నిజామాబాదు జిల్లాలోని నాగాపూర్ గ్రామాలు జాతీయ స్థాయి ఉన్నాయి.
Tags harish rao irkod kcr ktr slider tanneeru harish rao telangana governament telanganacm telanganacmo trs governament trswp