సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… ఓ భర్తగా, తండ్రిగా, హీరోగా, బిజినెస్ మ్యాన్ గా అన్నింట్లో సక్సెస్ పుల్ గా సాగుతున్నవాడే. అలాంటి మహేష్ ఇన్ని కార్యక్రమాలు బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నా… అతని ముఖంలో ఏమాత్రం అలసట కనిపించదు. ఎప్పుడు చూసినా కూల్ గా కనిపిస్తాడు. సినిమాల్లో బయట అదే గ్లామర్ మేయిన్ టెన్ చేస్తూ… నిత్య యువకుడిగా కనిపిస్తారు. మరి మహేష్ బాబుకు ఇన్ని పనుల్లో అంత ప్రశాంతమైన లైఫ్ ఎలా సాధ్యం అంటే.. తనేమని చెబుతారో తెలుసా..
నేను ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నా భార్య నమ్రతా అంటారు సూపర్ స్ఠార్ మహేష్ బాబు. అందుకే ఎక్కడ ఏం మాట్లాడినా తన ఫ్యామిలీ ఫస్ట్ ఆ తరువాతే ఏదైనా అంటాడు. అందుకే షూటింగ్స్ లేకుంటే ఇంట్లోనే ఉంటాడు. కానీ తన లైఫ్ లో తన ప్రతి పనిలో నమ్రతా వెనకాల ఉంటుందని చెబుతాడు.తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ మహేష్ ఫోటో తీస్తూ…వెనకాల ఉన్న నమ్రతా ఫోటో బ్లర్ చేసి తీశాడు. దీనిని మహేష్ బాబుకు చూపిస్తే… ఆఫోటోను సోషల్ మీడియాలో పెట్టి నా ప్రతి కష్టసుఖాల్లో నా వెనక ఉండేది తనే అంటూ ఫోటో షేర్ చేశాడు