రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పై అభిమానంతో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత, ప్రముఖ శిల్పి అరుణ్ ప్రసాద్ వడయార్ కోడెల తొలి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోకి నత్తారామేశ్వరంలో తీర్చిదిద్దారు.. ఈ విగ్రహాన్ని రూపొందించి వడయార్ త్వరలోనే కోడెల కుటుంబ సభ్యులకు అందించనున్నారు.
గతంలో ఇదేసంస్థ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తారకరామ సాగర్‌లో ప్రస్తుతం ఉన్న 36 అడుగుల ఎన్‌టీఆర్ విగ్రహాన్ని తయారుచేసి గతంలో కోడెలకు అందజేశారు. తాజాగా కోడెల మరణవార్త తెలుసుకుని ఆవేదన వ్యక్తంచేసిన అరుణ ప్రసాద్ తానే స్వయంగా కోడెల విగ్రహాన్ని తయారు చేశారు. అయితే మనిషి దహన సంస్కారాలు కూడా జరగకముందే కోడెల విగ్రహాన్ని తయారు చేయడం ఇక్కడ విశేషం.. అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు.