బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వచ్చిన రానా ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను తీసుకున్నది కూడా రానానే అట. దీంతో రానాకు జోడీగా నటించేందుకు కీర్తి సురేష్‌ను సంప్రదించారట. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కీర్తి సురేష్‌కి క్రేజ్ వుంది.
స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించడంతో కీర్తి క్రేజ్ పెరుగుతోంది. మహానటి సినిమాకు ముందు గ్లామర్ పరంగానే కీర్తిని యువత చూసేవారు. అయితే మహానటి సినిమా తర్వాత కీర్తి మంచి నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. అయితే రానాతో నటించమని కీర్తిని అడిగితే ఆమె రానాతో నో చెప్పిందట. ఇది చిత్ర యూనిట్ కు షాక్ తగిలిందట.. అయితే కీర్తికి కథ నచ్చలూదా.? డేట్స్ సర్దుబాటు కాలేదా.? అనేది తెలియలేదు. దీంతో నందినీరెడ్డి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. కీర్తి ఒప్పుకోకపోవడంత రానా కూడా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది.