తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు వరం.. తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గురువారం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దుబ్బాక ఎమ్మెల్యేరామలింగరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి తన్నీరు హారీష్ రావు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు నిర్మించాలంటే చాలా ఏళ్లు పట్టేది. కానీ పూర్తయ్యేవి కావు”అని తెలిపారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే పూర్తిచేస్తున్నాం.
మిగిలిన పనులు త్వరలోనే పూర్తవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దుబ్బాకుకు వరంలాంటిది.కాళేశ్వరం నీళ్లతో నియోజకవర్గంలో మొత్తం 319చెరువులను నింపుతాం..నియోజకవర్గంలో 1లక్ష 27వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీళ్లిస్తాంకాళేశ్వరంతో నియోజకవర్గ రైతన్నల జీవితాల్లో వెలుగులు..మల్లన్నసాగర్ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని “మంత్రి హారీష్ రావు అన్నారు.