నైన్‌టీస్‌లో ఈవీవీ డైరెక్షన్‌లో వచ్చిన జంబలకిడిపంబ సినిమా గుర్తుంది కదా..ఆ సిన్మాలో మగవాళ్లంతా ఆడవాళ్లలా మారిపోతారు..అచ్చం ఆడవాళ్లలా చీరలు కట్టుకుని, ఇంటిపనులు చేస్తూ.. ముత్యాల చెమ్మచెక్కా..రతనాల చెమ్మచెక్కా అంటూ డ్యాన్సులు వేస్తుంటారు..ఇక ఆడవాళ్లంతా ప్యాంట్లు, షర్ట్‌లు వేసుకుని, సిగరెట్లు, మందూ, పేకాట ఆడుతూ అచ్చం మగవాళ్లలా ప్రవర్తిస్తారు. నరేష్, ఆమని జంటగా ఈవీవీ సృష్టించిన ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా సేమ్ టు సేమ్ జంబలకిడి సినిమా..కేరళలో రిపీట్ అయింది. ఓనం పండుగను కేరళ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కేరళ మహిళలు ప్రత్యేకమైన ఓనమ్ చీరను ధరించి..ఓ చోట చేరుతారు..పువ్వులతో రంగవల్లులు వేసి, డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే మగవాళ్లు ఈ ఓనమ్ వేడుకల్లో మహిళల్లా అలంకరించుకుని, డ్యాన్స్ చేస్తే…ఊహించుకుంటేనే నవ్వు ఆగడం లేదుగా..అయితే ఓ వీడియో చూపిస్తాను…కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి రెడీగా ఉండండి..ఈ వీడియోలో కొంత మంది కేరళ అంకుల్స్ సేమ్ టు సేమ్ లేడీస్‌లా కేరళ సంప్రదాయంలో చీరకట్టుకుని.. ‘మనమెంతాయి’ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు.ఈ పాట కేరళ జానపద నృత్యం కైకొట్టి కాళి ప్రదర్శనలో పాడతారు. కేరళ మహిళలు ఓనమ్, తిరువతీర వంటి వేడుకల సందర్భంగా ఈ కైకొట్టి కాళి నృత్యాన్ని గుంపుగా చేరి ప్రదర్శిస్తారు. ఈ కేరళ అంకుల్స్ కూడా మహిళల్లాగా అలంకరించుకుని పూలు పెట్టుకుని..డ్యాన్స్‌లు వేశారు. పాపం వాళ్ల ఆఫీసులో ఆడవాళ్లు లేరేమో..అందుకే మగవాళ్లే ఇలా ఆడవారిలా రెడీ అయి డ్యాన్సులు వేస్తున్నారు అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే..మన జంబలకిడిపంబ సినిమాల్లో బ్రహ్మానందం, కోట, ఆలీలు ఆడవారిలో మారిపోయి ముత్యాల చెమ్మచెక్క, రతనాల చెమ్మచెక్క అంటూ వేసిన డ్యాన్స్ గుర్తుకువచ్చి పడీపడీ నవ్వడం ఖాయం. అయితే ఈవీడియో లేటెస్ట్ కాదని…గతంలోనే ఓనం పండుగ సందర్భంగా తీసిన వీడియో అని తెలుస్తోంది. అయినా ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో నవ్వులు పండిస్తూనే ఉంది. మీకూ ఆ వీడియో చూసి నవ్వుకోవాలని ఉందా..ఇంకెందు ఆలస్యం.. ఇదిగో ఆ వీడియో ..చూసి కడుపుబ్బా నవ్వుకోండి..