ప్రస్తుత జనాభా ప్రకారంగా భారతదేశం రెండో స్థానంలో ఉండగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ తెలివితేటలు విషయానికి వస్తే మనల్ని మించినవారే లేరని చెప్పాలి. ఎందుకంటే భారతీయులు ఏ దేశంలో అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర దేశాలు వాణిజ్య రంగంలో గాని, వేర్వేరు వాటిల్లో పైకి లేస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయులే.ఈ క్రమంలో భారతదేశం ఒక రికార్డు కూడా సృష్టించింది. ప్రపంచం మొత్తంలో విదేశాలుకు వలస వెళుతున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి సంభందించి ఐఖ్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో ఉన్న ప్రకారం ఇతర దేశానికి వెళ్ళిన వారు మొత్తం 27.2 కోట్లు ఉండగా అందులో 1.75కోట్ల మంది భారతీయులే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మెక్సికో, చైనా ఉన్నాయి.
