బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణాజిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతాయని చెప్పింది. ప్రజలు వాగులు దాటే సాహసం చేయరాదని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు సూచించారు.
