వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్ లో, గ్యాంగ్ స్టర్ గా తెరకెక్కిన సినిమా వాల్మికి, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ టాలీవుడ్ లో నటించే హీరోయిన్లపై అనవరంగా మాట్లాడేవాళ్లపై సురకలు అంటించారు. అలాంటి వాళ్లు మూర్ఖులన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే…
సినిమా ప్లాప్ అయితే హీరోయిన్లను తిట్టడం, ఐరన్ లెగ్ గా అభివర్ణించటం, సినిమా హిట్ అయితే గోల్డెన్ లెగ్ అనటం తప్పు అన్నారు హరీష్ శంకర్. అలాంటి సెంటిమెంట్స్ ని పట్టించుకోనని చెప్పారు. పూజా హెగ్డెకి దువ్వాడ సినిమాకు ముందు ఒక్క హిట్ లేదు. ఆ సినిమాలో ఆమెను తీసుకున్నాం. అప్పుడు ఎందుకు తీసుకున్నావ్ అని చాలా మంది అడిగారు. అలా రామయ్యా వస్తావయ్యా సినిమాకు సమంతను తీసుకున్నాం.. కానీ సినిమా ప్లాప్ అయింది. అందుకే అలాంటి పట్టించుకోనని చెప్పారు. తనకి మొదటి సినిమా ప్లాప్ అయిందని, ఆ సినిమా తరువాత నాలుగేండ్లు సినిమాలు లేవని, ఆ తరువాత రవితేజ మిరపకాయ ఇచ్చారని అలాంటప్పుడు నేను ఐరన్ లెగ్ అయితే నాకేందుకు సినిమా ఇస్తారని ప్రశ్నించారు. ఐరన్ లెగ్ లు, గోల్డెన్ లెగ్ లు ఉండవని కేవలం టైమింగ్ కుదరాలని అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు హరీష్ శంకర్.