‘జనగణమన’.. ఈ పదం వినిపించగానే ప్రతీ భారతీయ పౌరుడుకీ శరీరం మొత్తం దేశభక్తితో నిండిపోతుంది. అలాంటిది ఈ గీతాన్ని వేరే దేశం వాళ్ళు పాడితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన అగ్ర రాజ్యంలో జరిగింది. ప్రపంచ అగ్ర రాజ్యమైన అమెరికా సైన్యం కు చెందిన బ్యాండ్ బృందం భారత దేశ జాతీయ గీతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ వీడియో చూస్తున్న ప్రతీ భారతీయుడికి ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన దేశ జాతీయ గీతాన్ని అమెరికా సైన్యం ప్రదర్శించడం అంటే మామోలు విషయం కాదు. ఇక ఇదంతా ఎందుకనే విషయానికి వస్తే భారత – అమెరికా మధ్య రక్షణ పరమైన ఒప్పందాలు మరింత బలోపేతం చేసుకోవడానికి ‘యుద్ అభ్యాస్ 2019’ పేరుతో డ్రిల్ ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగానే ఇదంతా చేసారు.
हर भारतीय के लिए गर्व का क्षण। हमारा "राष्ट्रगान" #USArmy Band द्वारा #YudhAbhyas19 में परफॉर्म किया गया। @adgpi
#IndianArmy@IndianEmbassyUS @TheSatishDua @ColonelSingh @ajitbhinder @bhushan_gyan @Ptr6Vb @rwac48 @LtGenGurmit @LTGSubrataSaha @kkhushal9 @simply_mixed_up pic.twitter.com/nfhGDKU9UM— Indian Army News हिंदी (@IndianArmyNewsH) September 19, 2019