తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర మెట్రోకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఎనబై వరకు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు హైదరాబాద్ మెట్రోకు సంబందించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ”దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్..
అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో మొత్తం 370కేసులు మెట్రోపై ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక ఏర్పాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో రెండేళ్లలోనే 360కేసులకు పరిష్కారం చూపించామని”అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”హైదరాబాద్ మెట్రోలో రోజుకు 3లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.
సకల సౌకర్యాలుండటం వలనే ఇంతమంది ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో ఆర్టీసీ ఏసీ బస్సుల ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలే తక్కువ” అని అన్నారు.తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికి చెన్నై మెట్రోలో రోజుకు 75వేల మందే ప్రయాణం చేస్తున్నారు. త్వరలోనే పాతబస్తీకి తప్పకుండా మెట్రో తీసుకువస్తాం.మెట్రోపై అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలి. చెన్నై,బెంగుళూర్,ఢిల్లీ తదితర నగరాల్లో మెట్రో నిర్మాణానికి తొమ్మిదేళ్లు పడితే హైదరాబాద్ మహనగర మెట్రో నిర్మాణానికి ఆరేళ్లే పట్టింది అని అన్నారు మంత్రి కేటీఆర్ .