ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు.
ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…!
*తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు.
*తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు.
*కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు.
*కోపం గా మాట్లాడితే తిరగబడతారు కూడా.
*కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఇంట్లో వస్తువులపై చూపిస్తారు.
ఇక ఆడపిల్లల విషయానికి వస్తే…!
* వారు తినే కంచం కడుక్కోడానికి కూడా బద్దకమే.
*ఎక్కువ శాతం ఆడపిల్లల్ని తండ్రులు గారభం చేస్తారు. దాంతో తల్లిపై కోపం ఎక్కువ చూపుతారు.
*ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కానిసం నీళ్ళు ఇచ్చే ఆడపిల్లలు ఏరోజుల్లో కరువయ్యారు.
*ప్రస్తుత జనరేషన్ కు అలవాటు పడి పాత పద్దతులు అన్ని మర్చిపోతున్నారు.
దీనంతటికీ కారణం పిల్లలు కాదు వాళ్ళని ఇలా తయారుచేస్తున్న తల్లిదంద్రులాడే. దీనికి కారణం వారే. అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతూ వారిని సోమరపోతులను చేస్తున్నారు. బయటవాలకు మనం రిచ్ గా కనిపించాలని అందరు అనుకుంటారు. దానికి గారాబం తోడవ్వడంతో పిల్లలు ఇలా తుయరవుతారు. కష్టం విలువ తెలిసేలా పెంచితే వారికి ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అప్పుడే జీవితంలో బాగుపడతారు. అలా కాదని గారాబంగా పెంచితే చివరికి వారిపైనే తిరగబడతారు. ఈరోజుల్లో 15రోజులకే సిగరెట్లు, మందు, అమ్మాయిలు ఇలా అన్ని అలవాటు చేసుకుంటున్నారు. అప్పట్లో 70ఏళ్ళు వచ్చిన మనిసి దృడంగా ఉండేవాడు. కాని ఈరోజుల్లో చిన్నపిల్లవాడి దగ్గరనుండి ఏదోక జబ్బు వస్తూనే ఉంది. దానికి కూడా వాళ్ళే కారణమని చెప్పాలి. ఇంట్లో నాణ్యమైన తిండి వదిలేసి ఎల్లప్పుడు బయట తిండి తినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది బాగా అలవాటు అయిపొయింది. ప్రస్తుత రోజుల్లో వారికి నేర్పాల్సింది బాధ్యత,గౌరవం, మర్యాద, ప్రేమా, కష్టం, నష్టం, కుటుంబ సంబంధాలు వంటివి నేర్పాలి. అలా చేయని ఎడల ఎప్పటికీ మారారు.