ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్‌లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్‌లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు రావడం కామన్ అయిపోయింది. ఇంకేముంది ముసలోళ్లం అయిపోతామని దిగులు పట్టుకుంటుంది. ముఖ్యంగా లేడీస్‌కు అందంగా కనపడాలనే తాపత్రయం ఇంకా పెరుగుతుంది. జుట్టుకు రంగు వేయడం, ముఖానికి ఫేస్ క్రీమ్‌లు వాడడం, బ్యూటీపార్లర్లకు వెళ్లడం, రకరకాల ఫేషియల్స్ చేయించడం..ఇలా ముఖ సౌందర్యానికి వేలకు వేలు..ఖర్చుపెడతారు…ఫౌండేషన్ క్రీమ్స్, ఐ లైన్‌లు, ఐబ్రో పెన్సిల్స్…ఇలా…కళ్లను హైలైట్ చేసే మేకప్‌లు వేసి, కళ్ల కింద ముడతలు, నల్లటి చారలు కనిపించకుండా కవర్ చేస్తుంటారు. అయితే వీటికి బదులు కళ్ల కింద నల్లటి చారికలు, ముడతలు పోయేలా ఓ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మిషన్ కళ్ల కింద వచ్చిన మచ్చలను పొగొట్టడంతో పాటు…వయసుతో వచ్చే ముడతలను పోగొడుతుంది. ఈ మిషన్‌ను రోజూ 3 నిమిషాలు కళ్లకు పెట్టుకుంటే చాలు..నల్లటి చారికలతో పాటు, ముడతలు కూడా పోతాయి. కళ‌్ల కింద చర్మం మెరుగవుతుంది. ఈ మిషన్ బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి హార్ట్ , సాఫ్ట్ మోడ్స్ ఉంటాయి.ఈ మిషన్‌ను ఆన్ చేయగానే..కంపనాలు వస్తూ..హీట్ జనరేట్ అవుతుంది. హార్ట్ మూడ్ ఆన్ చేసుకుంటే విద్యుత్ ప్రకంపనాలు వేగం పెరుగుతుంది. తద్వారా ముడతలు, నల్లటి మచ్చలు తొందరగా పోతాయి. ఈ మిషన్ ను కొన్నప్పుడే పింక్ కలర్‌లో ఉన్న పైభాగంతోపాటు, నాలుగు వైట్ ప్యాడ్స్, రెండు బ్యాటరీలు వస్తాయి. ఈ మిషన్‌ను ఐస్లాక్ హరుకా అంటారు . మార్కెట్‌లో ఈ మిషన్ ధర మన కరెన్సీలో 5895 రూపాయలు ఉంది. ఈ మిషన్ జపాన్‌లో తయారైంది. అందుకే కాస్త కాస్ట్ ఎక్కువే అయినా ఫలితం బాగా ఉంటుంది. డైలీ ఈ బ్యూటీ గాడ్జెట్ వాడితే కళ్లకింద చారలు, ముడతలు పోయి చర్మ సౌందర్యం కూడా మెరుగుఅవుతుంది. అరవై ఏళ్ల భామలు కూడా ఇరవై ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు.