నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
