ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు తన రాజకీయ జీవితం చరమాంకంలో ఎదురైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం..అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు శవరాజకీయం చేశాడు. నిజానికి కోడెలపై కేసులు గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, ఆగడాలకు బలైపోయిన బాధితులు పెట్టినవి..ఏ శంకర్రావునో, ఎర్రంనాయుడినో ఉసిగొల్పి జగన్‌పై పెట్టిన రాజకీయ కేసులు తరహావి కావు. హైకోర్ట్ కూడా కే ట్యాక్స్ కేసుల విషయంలో ఆయనపై విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేసింది. అయినా కోడెల ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంగా ప్రభుత్వం సంయమనం పాటించింది. కానీ చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు ప్రభుత్వమే ఆయన్ని హత్య చేసినట్లుగా ఎల్లోమీడియాలో రంకెలు పెట్టారు. జాతీయ మీడియాను సైతం మేనేజ్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించారు.
కాగా నవ్యాంధ‌్ర ప్రదేశ్‌కు తొలి స్పీకర్‌గా పని చేసిన కోడెల మీద గౌరవంతో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను జరిపించమని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ కోడెల భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వచ్చిన రెవిన్యూ అధికారులు, పోలీసులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోడెలను ప్రభుత్వమే హత్య చేసిందంటూ నినాదాలు చేస్తూ ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడానికి వీల్లేదంటూ రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేటలోని కోడెల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కోడెల కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు పట్టించుకున్న పాపానా లేదు..పైగా ఆయన కొడుకు, కూతురు వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని..సస్పెండ్ చేయిస్తా అంటూ వార్తలు మీడియాకు లీక్ చేశారు. అంతే కాదు..అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో వర్ల రామయ్య, సత్తెనపల్లి, నరసరావుపేట నేతలతో కోడెలను మీడియాముఖంగా తిట్టించాడు. కష్టకాలంలో పార్టీ అండగా లేకపోవడం, సీనియర్ అయిన తనను చంద్రబాబు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన కోడెల ఆత్మహత్య పాల్పడ్డారు. అయితే ప్రభుత్వ వేధింపులవల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ చంద్రబాబు శవరాజకీయం చేశాడు. రెండు రోజుల నుంచి టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ దుమ్మెత్తిపోత్తున్నాయి. అయినా సీఎం జగన్ పెద్ద మనసుతో తన పార్టీ కాకపోయినా, మాజీ స్పీకర్‌పై గౌరవంతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని చూస్తే..చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డుకోవడం అత్యంత నీచాతి నీచం. ఒక సీనియర్ నాయకుడి అంత్యక్రియలను అధికారికంగా జరిపిస్తే ఎంత గౌరవం ఉంటుంది..అవేమి బాబుకు ఇష్టం ఉందడు. తనకు కావాల్సిందల్లా రాజకీయం మాత్రమే. శవరాజకీయాలు చేయడంలో బాబు తర్వాతే ఎవరైనా అని ఈ ఉదంతంతో అర్థమవుతుంది. ఛీఛీ..కోడెల అంత్యక్రియల్లో కూడా ఇంత చిల్లర రాజకీయమా …ఆఖరికి ఆయన చితిమంటల్లో కూడా చలికాచుకుంటావా చంద్రబాబు…అంటూ నరసరావుప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.