తెలంగాణ రాష్ట్రంలోని అని వర్గాల సంక్షేమాభివృద్ధికై పలు పథకాలను తీసుకొచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఈ క్రమంలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 661 గురుకులాలు ఏర్పాటు చేశాం. అన్ని సర్కారు హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” రాష్ట్ర అభివృద్ధికై ఒక్కసారి మాటిస్తే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు.
ఆర్థిక మాంద్యం ఉన్న కానీ రాష్ట్రంలో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్లు,పింఛన్లు,రైతుబంధు,రైతుబీమా, కళ్యాణ లక్ష్మీలాంటి పథకాలు ఆగడం లేదు. సంక్షేమం ఆగడం లేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అగడం లేదు. టీఆర్ఎస్ హాయాంలో పలు సంక్షేమాభివృద్ధి పథకాలు అమలవుతుంటే కాంగ్రెస్ హాయాంలో గల్లీకో పేకాట క్లబ్ ,ఇసుక భూమాఫీయా ఉండేది అని మంత్రి విరుచుకు పడ్డారు.