గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అరవై పైసల లాభంతో రూ.71.19వద్ద ట్రేడవుతుంది.
