టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో నే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ మేట్ ఎవరైనా సరే షో నిర్వాహకులు వారికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఒక జంటగా కూడా వచ్చారు. వారే వరుణ్, రితిక. వీరిద్దరికీ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు భారీ పారితోషకం ఇచ్చారు. 28 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక వీరిలో ఎవరు ఫైనల్ కు వెళ్ళినా ముందు అనుకున్నదానికన్నా ఎక్కువ అడుగుతారనే వార్తలు కూడా వస్తున్నాయి.
