దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మైక్ పట్టారంటే మాట్లాడటమే కాదు.. పంచ్‌లు ప్రాసలతో చెలరేగిపోతున్నారు. తాజాగా వాల్మీకి మూవీలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ముసలాయనే కాని.. మహానుభావుడు అన్నట్టుగా మాట్లాడి రాఘవేంద్రరావు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా పూజా హెగ్డేపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. తరువాత పూజా మాట్లాడుతూ వేదికపై ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. శ్రీదేవి మ్యామ్ నాకు స్పూర్తి, మొదట్లో ఈ పాటకు డ్యాన్స్ చేయగలనా? అని టెన్షన్ పడ్డాను. కానీ శ్రీదేవి గారిని స్పూర్తిగా తీసుకుని చేశాను అని చక్కగా మాట్లాడింది. ఇక అక్కడ ఉన్న ఒక బిందెను తీసుకుని దానికి ముద్దుపెట్టి దర్శకేంద్రుడిగా గిఫ్ట్ ఇచ్చింది. రాఘవేంద్రరావు కూడా సంతోషంగా ఆ బిందెను స్వీకరించారు. ముద్దుతో బిందెను కానుక ఇవ్వడంతో అమ్మడి అభిమానులు పూజాని తెగ పొగిడేస్తున్నారు.