చిరంజీవి కష్టనష్టాలకు ఓర్చి మెగా ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. తాను వేసిన దారిలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలుగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవికి మంచి పేరును కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా పేరు సంపాదించాడు. అయితే ఇదే వరుసలో మొదటిసారి ఒక ఆడపిల్ల, అందులో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. కెరియర్ మొదట్లో సినిమాలు, కొన్ని షోలు చేసినా..అవి ఆశించిన రేంజ్ హిట్ కాలేకపోయాయి. ఆ సినిమాల్లో మెగా ఫ్యామిలీకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా డీసెంట్ డ్రెసింగ్ తో అందరికి కనిపించింది. అయితే ప్రస్తుతం అమ్మడు నయా ట్రెండ్ ఫాలో అవుతుంది. తను కూడా అందరి లాంటి హీరోయినే అంటూ.. హాట్ లుక్స్ తో సంపేస్తుంది. తన ఇంస్టా వేదికగా హాట్ డ్రెస్ తో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తుంది.