తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టీఆర్ఎస్ సర్కారును ఆదర్శంగా తీసుకుంటుంది.
రాష్ట్రంలోని పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్త పురపాలక చట్టంపై జీహెచ్ఎంసీ ఆఫీసులో జరిగిన సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసమే కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చాం. అధికారులు చట్టంపై సామాన్య ప్రజానీకానికి అవగాహాన కల్పించాలి. మనమంతా ఒక బృందంగా కలిసి పని చేసి బంగారు తెలంగాణని నిర్మిద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షల కోసం అధికారులు పనిచేయాలి. పట్టణాల్లో అధికారులంతా సమన్వయంతో పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.