తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో హుజూర్ నగర్ నుండి చామల కిరణ్ రెడ్డి బరిలోకి దిగుతారు. అతనికే నా మద్ధతు అని ఆయన ప్రకటించారు. అయితే పార్టీలో చర్చించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి ని అభ్యర్థిగా ఖరారు చేశారు అని ఫైర్ అయ్యారు.