పసిడి ధర పడిపోయింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ప్రస్తుత పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడ తగ్గింది ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.6 శాతం తగ్గుదలతో రూ.47,075కు క్షీణించింది. వెండి ధర ఈ నెల ప్రారంభంలో రూ.51,489 గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ.4,400 పతనమైంది. దీంతో నగల షాపులకు క్యూ కట్టారు.
