తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లకు,కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది. అందులో భాగంగా అన్ని రకాల స్కూళ్లకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు సెలవులు ఇచ్చారు. అయితే సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భ్ంగా ప్రకటించింది.
