దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉండగా… ఇప్పుడు కిలో ధర రూ. 60కి పెరిగింది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటంతో… ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.
Tags delhi Heavy rainfall markets onion prices
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023