గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై వ్యంగ కార్టూన్లతో ప్రచారం చేస్తున్న కార్టూనిస్ట్ రమణకు మా దరువు మీడియాకు ఎటువంటి సంబంధం లేదు. కార్టూనిస్ట్ రమణ గతంలో మా సంస్థలో ఉద్యోగిగా పని చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇటీవల ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రమణ మా దరువు వెబ్‌సైట్‌కు కానీ, యూట్యూబ్ ఛానల్‌కు కానీ తన సేవలను అందించడం లేదు. కావున ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు..ఈ విషయాన్ని మా దరువు పాఠకులు, నెట్‌జన్లు గమనించగలరు.
