మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ ప్రొమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఓ ఇంటర్వ్యూ లో చిత్రం గురించి కొన్ని విశేషాలు తెలిపాడు. మీడియా వ్యక్తి ఒకరు సుదీప్ ను ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే చిరంజీవి నుండి మీరు ఏమి నేర్చుకున్నారు అని అడగగా.. మెగాస్టార్ ని చూసి నేను రాజకీయాల్లో అడుగుపెట్టికూడదని అనుకున్నానని, చిరంజీవి గారు 10ఏళ్ళు రాజకీయాల్లో ఉండి, సినిమాలకు దూరమయ్యిపోయారని అన్నారు. రాజకీయాల్లో ఉండాలి, అది ఇండస్ట్రీ పరంగానే ఉండాలని చెప్పారు.