ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం తన కెరీర్ కే హైలైట్ గా నిలిచింది. అనంతరం హీరోయిన్ నుండి నిర్మాతగా మారింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి పూరీతో కలిసి నిర్మాణ పనుల్లో పల్గోనింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఛార్మి నిర్మాతగానే కాకుండా వేరు వేరు రంగాల్లో అడుగుపెట్టాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ స్టార్స్ ఆడే క్రికెట్ మ్యాచ్ లకు సపోర్టర్ గా ఉండేది. ముఖ్యంగా టాలీవుడ్ వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడ్డు సపోర్ట్ ఒక్కటే కాకుండా బిజినెస్ కోణంలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక స్పోర్ట్స్ నే కాకుండా అన్ని రంగాల్లో అడుగుపెట్టనుందని తెలుస్తుంది.
