తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు కోడెల మరణాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు విపరీతంగా కృషి చేస్తూనే మరోవైపు ఆయనకు దక్కాల్సిన గౌరవం, కోడెల పొందాల్సిన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాస్తవానికి ఈ రోజుకి కోడెల చనిపోయి మూడోరోజు అయినా సరే మూడురోజులు జరిగినా కూడా ఈ విషయంలో కావాలనే తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు కోడెల కుటుంబ సభ్యులందరితో చంద్రబాబు కావాలనే ఎటువంటి అధికార లాంచనాలు వద్దని చెప్పాడట. ఆయన బ్రతికి ఉన్నప్పుడు మానసికంగా హింసించి, అపాయింట్మెంట్ అవ్వకుండా అన్ని తప్పులు చేయించి, కేసులు నమోదు చేసిన చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ శవం దగ్గర ఉండి రాజకీయాలు చేయడం చూస్తున్న సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త విసుక్కుంటున్నారట. గతంలో హరికృష్ణ శవం వద్ద చంద్రబాబు రాజకీయాలు చేసిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.