గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడోచోట అల్లర్లు, గొడవలు సృష్టించడం దానికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని తన మీడియా ద్వారా ప్రచారం చేయించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడులో గొడవలు చేయించడానికి చంద్రబాబు ప్లాన్ చేశారట. వాస్తవానికి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నో సృష్టించారట.
అయితే తాజా ఘటనలో కోడెలపై ప్రభుత్వం ఎటువంటి కేసు పెట్టకపోవడం ఆయన గురించి ప్రజలు కేసులు పెట్టడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం.. ఇనిమెట్ల గ్రామంలో జరిగిన దాడితో మానసికంగా కుంగిపోవడం.. చంద్రబాబు పట్టించుకోకపోవడం.. పార్టీపరంగా అనేక తప్పులు చేయించడం.. స్పీకర్ స్థానానికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన ముద్రపడడం.. చంద్రబాబు, లోకేశ్ పట్టించుకోకపోవడం.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం వంటి ఘటనలతో ఆయన కృంగిపోయారు.
అయితే కోడెల మరణవార్తతో మరోసారి పల్నాడులో చంద్రబాబు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారట. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవ్వరు కూడా ఆయనకు సహకరించట్లేద.. చంద్రబాబు పని అయిపోయింది అని ఇప్పుడు ఆయన చెప్పినట్టు గొడవలు చేస్తే మనకే ఇబ్బందులు ఎదురవుతాయని, ఆయన చెప్పినట్టుగా ఇక్కడ చేయడాడానికి పెద్దగా ఏమీ లేకపోయినా చంద్రబాబు కావాలని ఇలా గొడవలకు పురిగొల్పుతుండటంతో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారట.