తాజాగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాదరావు చనిపోయిన అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం పట్ల వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
1)గతంలో SC, ST కేసులతో భూమా నాగిరెడ్డిని హింసించి పార్టీ ఫిరాయింపచేసారు. ఆయనకు మంత్రిపదవి ఆశచూపి ఇవ్వకపోవడంతో అటు వైసీపీకి టీడీపీకి కాకుండా మధ్యలో ఉండి మానసిక వేదనతో భూమా నాగిరెడ్డి చనిపోయేలా చేసింది ఈ చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు.
2) అలాగే గతంలో పదవి వ్యామోహంతో పిల్లనిచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచి మానసికవేదనతో చనిపోయేలా చేసిన వెన్నుపోటు వీరుడు చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు.
3) అలాగే నందమూరి హరికృష్ణనే ఎన్నోసార్లు రాజకీయంగా హెరాస్ చేసి తన కొడుకు లోకేశ్ కు అడ్డు ఎక్కడ వస్తాడోనని హరికృష్ణ ను పార్టీ కార్యక్రమాలకు దూరంచేసి, పదవులు ఇవ్వకుండా ఆ మానసికంగా హింసించి, అవమానించి ఆయన చనిపోయేంత వరకూ పట్టించుకోకుండా చనిపోయాక కూడా శవం వద్ద టీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు.
4) అలాగు అవసరం ఉన్నంతవరకు కోడెల ను వాడుకొని అవసరం ఎంతఉంటే అంత దిగజార్చి చివరికి అతని కొడుకును ప్రోత్సహించి అక్రమాలు చేయించి తప్పంతా కోడెలకు చుట్టుకుంటున్న సమయంలో ముఖంచాటేసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కోడెల ను అవమానించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేసింది చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు. వీళ్లను చంపింది చంద్రబాబు కాకపోవచ్చు.. కానీ మానసికంగా హిసించి బాధ పెట్టింది చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు.