రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ . 2024 కోట్ల వ్యయం అవుతుందన్నారు.
Tags bonus central governament railway employees
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023