Home / TELANGANA / 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక.. గ్రామాల్లో మార్పు కన్పించాలి.. సీఎస్ ఎస్ కె జోషి

30 రోజుల ప్రత్యేక ప్రణాళిక.. గ్రామాల్లో మార్పు కన్పించాలి.. సీఎస్ ఎస్ కె జోషి

ఈ నెల 6 నుండి గ్రామాలలో ప్రారంభమైన 30 రోజుల గ్రామాల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలులో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల స్వరూపంలో మార్పు కన్పించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్పరెన్స్ ద్వారా గ్రామాలలో చేపడుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రణాళిక లో భాగంగా గుర్తించి చేపడుతున్న పనులు, నిరంతరం అమలయ్యేలా చూడాలని ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల స్వరూపం మారాలని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల స్పూర్తిని కొనసాగించాలని ప్రభుత్వ సంస్థలతో పాటు గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి వార్షిక, పంచ వర్ష ప్రణాళికలు రూపొందించాలన్నారు. డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, నర్సరీలకు స్థలాలను గుర్తించి వినియోగంలోకి వచ్చేలా చర్యలు మొదలు పెట్టాలన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగాలని కేవలం ఒక సారి మాత్రమే పనులు చేపట్టేలా కాకుండా Mission Mode తరహాలో నిరంతరం అమలయ్యేలా చూడాలన్నారు. మన ఊరు మనమే భాగుచేసుకొనేలా ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకరావాలన్నారు. గ్రామాలలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలన్నారు. పవర్ వీక్ లో భాగంగా శిథిలమైన స్థంబాల తొలగింపు, కరెంటు తీగలు సరిచేయడం, థర్డ్ వైర్ ఏర్పాటు , గ్రామ పంచాయతీలకు మీటర్లు తదితర పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఆస్పత్రులలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకొని మంచి పనులు జరిగేలా చూడాలని , జాగ్రత్త తో దీర్ఘ కాలం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పవర్ వీక్ లో గుర్తించిన పనులను పూర్తి చేసేలా చూసుకోవాలన్నారు. గ్రామాలలో చెత్త సేకరణ కోసం డస్ట్ బిన్ లు సరఫరా చేసి నందుకు జగిత్యాల కలెక్టర్ డా.ఎ.శరత్ ను ప్రత్యేకంగా అభినందించారు.పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనుల కోసం నిధులను కేటాయించామని రిసోర్స్ మ్యాపింగ్ చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో ఇప్పటికే నెలకొన్న డెబ్రిస్ ను క్లియర్ చేయడం తో పాటు పరిశుభ్రత కొనసాగేలా చూడాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat