Home / TELANGANA / ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం.. కేటీఆర్

ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం.. కేటీఆర్

ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. పట్టణీకరణలో మన రాష్ర్టానికి ఐదోస్థానం ఉంది. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవ చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నాం. కొత్త మున్సిపాలిటీ చట్టంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం. ప్రతి మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున హరితహారం అమలు చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా మెరుగ్గా చేయాలన్న సూచనను పరిగణలోకి తీసుకున్నాం. తడి, పొడి వ్యర్థాల నిర్వహణలో మనం పురోగతి సాధిస్తున్నాం. అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించాం. దేశంలో ఐదో అతిపెద్ద నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నాం. హైదరాబాద్ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో పేదలకు బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్‌లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతాం. ముసీ సుందరీకరణ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. మురికి నీటి శుద్ధికి అవసరమైన ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేస్తాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat