కుల వృత్తులకు చేయూత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు. ఈ నెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనునట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. ఒక యూనిట్ విలువ లక్షా 25 వేలు కాగా.. 75 శాతం ప్రభుత్వ సబ్సిడీ, 25 శాతం లబ్ధిదారుడికి వాటా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రూ.5వేల కోట్లతో గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడిపై గొర్రెల పంపిణీ చేపడతామని చెప్పారు.