తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు.